నిహారిక పెళ్ళికి హాజరైన పవన్ కళ్యాణ్

మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక వివాహం మరికొన్ని గంటల్లో ఘనంగా ఉదయ్ పూర్ లో జరగబోతుందన్న సంగతి తెలిసిందే. ఉదయ్ విలాస్ లో ఈ శుభకార్యం జరగనుంది. తొలి రోజు సంగీత్‌.. తర్వాతి రోజు మెహందీ ఫంక్షన్లు స్వీట్‌గా జరిగాయి. మెగా ఫ్యామిలీలోని ప్రతీ ఒక్కరు ఈ వేడకకు హాజరవ్వగా.. ఇక్కడ మెగా హీరోల సందడి మాములుగా లేదు. అనేక రకాలుగా ఫోటోస్ దిగుతూ సందడి చేస్తున్నారు.

రాజకీయాలతో బిజీగా జనసేన అధినేత.. మెగా బ్రదర్‌ పవన్ నిహారిక పెళ్ళికి వెళ్తారా వెళ్ళారా అన్న సందేహంలో అభిమానులున్నారన్న సంగతి తెలిసిందే. వీరి సందేహానికి పవన్ కళ్యాణ్ తెరదించారు. నీహారిక పెళ్లివేడుకలకు పవన్ హాజరయ్యారు. తనదైన స్టయిల్ సింపుల్ డ్రెస్ లోనే కనిపిస్తున్నారు పవన్. పవన్ తన వైట్ కలర్ కుర్తా పైజామాకు బ్రౌన్ ఫ్లోటర్స్ ను పెయిర్ చేశారు. పవన్ తో పాటు పెద్ద కొడుకు అకిరా నందన్ కూడా ఈ వేడుకలలో జాయిన్ అయ్యాడు. సంగీత్ కార్యక్రమానికి పవన్ హాజరు కాలేకపోయినా మంగళవారం రాత్రి మెహెందీ వేడుకలకు హాజరయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసి సందడి చేశారు.

వివాహ వేడుక జరుగుతున్న ఉదయ్ విలాస్ కి పవన్ రావడంతో మెగా ఫ్యామిలీ అంతా ఆనందాన్ని వ్యక్తం చేసింది. నాగబాబు సోషల్ మీడియాలో ఇలా స్పందించారు. `ఈ క్షణం పూర్తి కావడానికి చివరి ఆనందం కూడా వచ్చింది` అని తమ్ముడిపై తనకున్న ప్రేమని చాటుకున్నారు. తన తమ్ముడి రాకతో ఆనందంతో నాగబాబు పరవశించిపోయారు.

ఇక ఉదయ్‌ నివాస్‌లో జరుగుతున్న పెళ్లి వేదిక అదిరిపోయింది. రాజస్తానీ స్టైల్లో థీమ్‌ను ఏర్పాటు చేశారు. పెళ్లికి అతి కొద్దిమంది అతిథులనే పిలిచినట్లు తెలుస్తోంది. టాలీవుడ్‌ నుంచి టాప్‌ హీరోలు.. హీరోయిన్లు హాజరవుతున్నారు. కొందరు డైరెక్టర్లు, నిర్మాతలను కూడా మెగా ఫ్యామిలీ ఆహ్వానించినట్లు తెలుస్తోంది.