పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జనసేన మహోద్యమానికి శ్రీకారం

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఈ నెల 12, 13, 14 వ తేదీల్లో మండల వ్యాప్తంగా జగనన్న కాలనీలను సందర్శించి ప్రభుత్వ మోసపూరిత తీరును ఎండగట్టనట్లు జనసేన మండల నాయకులూ గంజికుంట రామకృష్ణ, తుపాకుల భాస్కర్, నారాయణస్వామిలు తెలిపారు. మండలంలో కొన్నిప్రాంతాల్లో నివాసాలకు ఏ మాత్రం యోగ్యం కానీ ఇళ్ల స్థలాల నుంచి జగనన్న కాలనీల అంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాన్ని క్షేత్రస్థాయిలో తూర్పార పట్టనున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జనసేన మహోద్యమానికి శ్రీకారం చుట్టామన్నారు. అందులో భాగంగా ఈ నెల 12,13,14వ తేదీల్లో మండలంలోని అన్ని పంచాయితీల పరిధిలో గృహ నిర్మాణ పథకాలు జగనన్న కాలనీలో సముదాయాలను సందర్శించి అవి ఏయే దశల్లో ఉన్నాయో పరిశీలిస్తామన్నారు. మూడు రోజుల పాటు ఆయా కాలనీలో విస్తృతంగా పర్యటించి లబ్ధిదారులతో ప్రత్యక్షంగా మాట్లాడి ప్రీతి అంశాన్ని ఫోటోలు వీడియో రూపంలో పార్టీ అధిష్టానం పిలుపు మేరకు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామన్నారు. జగనన్న కాలనీలో తిష్టవేసిన ప్రతి సమస్యపై జనసేన ప్రజల దృష్టికి తీసుకొచ్చి అవి పరిష్కారం అయ్యేవరకు ప్రభుత్వంపై ఉద్యమ బావుట ఎగురవేస్తామన్నారు. ప్రభుత్వం అందిస్తున్న 1.80 లక్షల కాకుండా అదనపుభారం లబ్ది దారుని పై పడుతుందో, ఇళ్ళ నిర్మాణం ఏ ఏ దశల్లో ఉందొ తెలుసుకొని ఇసుక కొరత, తాగునీటి సరఫరా, విద్యుత్ లైన్లు, రహదారులు డ్రైనేజీల నిర్మాణం ఇలా ప్రతి మౌళిక సదుపాయం పై సంబంధిత అధికారులపై ఒత్తిడి చేసి సమస్య పరిష్కారం చేయడానికి జనసేన కృషి చేస్తుందన్నారు.