పవన్ వారాహి యాత్ర విజయవంతం కావాలి..

గుంతకల్లు నియోజకవర్గం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తలపెట్టిన వారాహి యాత్ర విజయవంతం కావాలని గుంతకల్లు నియోజకవర్గం, గుంతకల్లు టౌన్, మోదినభాద్ జనసేన పార్టీ జనసైనికుల అధ్వర్యంలో మోదినాబాద్ లో ‎డా. బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీగా వెళ్లి మోదినభాద్ ఎల్లమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేయించి, మరియు మోదినాబాద్ చర్చి నందు ప్రార్ధించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి అరికేరి జీవన్ కుమార్, మైనారిటీ నాయకుడు జిలాన్ బాషా, జనసేన పార్టీ నాయకులు హెన్రీ పాల్ (ఎల్.ఎల్.బి), మారుతీ కుమార్ యాదవ్, తాడిపత్రి మహేష్, ఎల్లి, రాజు, పౌలు, సురేష్, సంసొన్, ఆర్ సీ సురేష్ (ఎల్.ఎల్.బి), నవీన్, మరియు తదితరుల పాల్గొన్నారు.