రాజంపేటలో ఉధృతంగా కొనసాగుతున్న పవనన్న ప్రజా బాట

రాజంపేట: రాజంపేట జనసేన పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు, పవనన్న ప్రజా బాట 83వ రోజు కార్యక్రమంలో భాగంగా గురువారం రాజంపేట మండలం, అస్తవరం పంచాయతీ లోని పలు గ్రామాలైన చెర్లోపల్లి, రెడ్డివారిపల్లి, అస్తవరంలో ఇంటింటికి తిరిగి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను, ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య, జనసేన నాయకులు భాస్కర పంతులు, వెంకటయ్య, పోలిశెట్టి శ్రీనివాసులు, వీరయ్య ఆచారి, హేమంత్, జనసేన వీరమహిళలు జెడ్డా శిరీష, మాధవి, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీరమహిళలు పాల్గొనడం జరిగినది.