60వ రోజుకు చేరిన పవనన్న ప్రజా బాట

వైజాగ్ సౌత్: ప్రజా సమస్యల పరిష్కారానికి అహర్నిశలు శ్రమిస్తానని దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అన్నారు. ఆయన ఆధ్వర్యంలో నియోజకవర్గంలో చేపట్టిన పవనన్న ప్రజా బాట కార్యక్రమం 60వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పలు ప్రాంతాలలో ఆయన పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి అందరిని పలకరించారు. అందరి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం తను కృషి చేస్తానని చెప్పారు. పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం కూడా అధికారులతో చర్చించి తగు చర్యలు తీసుకునే విధంగా ప్రయత్నం చేస్తానని వెల్లడించారు. గత 60 రోజులుగా తను చేపడుతున్న ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ప్రజల నుంచి అనూహ్యస్పందన వస్తుందన్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని చెప్పారు. ప్రజలు మంచి కోసం తను ఏమి చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో తాను చేపడుతున్న సేవాకార్యక్రమాలను మరింతగా విస్తరిస్తున్నట్లు వెల్లడించారు.