బొడ్డేపల్లి గేటు వద్ద ఉన్న రైల్వే అండర్ పాస్ పనులు పూర్తి చేయాలని పేడాడ రామ్మోహన్ డిమాండ్

  • వర్షం పడితే రాకపోకలు బంద్
  • 40 గ్రామాల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు

ఆమదాలవలస నియోజకవర్గం, పొందూరు మండలం, బొడ్డేపల్లి రైల్వే గేటు సమీపంలో నిర్మించిన అండర్ పాస్ లో రాకపోకలకు అంతరాయం ఏర్పడిన విషయం తెలుసుకున్న నియోజకవర్గ ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ రావు మాట్లాడుతూ… శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి అండర్ పాస్ లో భారీ ఎత్తున నీరు చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా కావలి, వాల్తేరు, పనసపేట తదితర ప్రాంతాల ప్రజలు, శ్రీకాకుళం జిల్లాలోని బెలమాం, లొద్దలపేట, తాడివలస, గండ్రేడు, లత్సయ్యపేట, గోరింట, గోకర్ణపల్లి, వెంకంపేట తదితర గ్రామాల ప్రజలు వందల సంఖ్యలో నిరంతరం శ్రీకాకుళం పట్టణానికి రాకపోకలు సాగిస్తూ ఉంటారు. అండర్ పాస్ వరకు వచ్చి మరలా వెనుకకు వెళ్లి పొందూరు మీదుగా శ్రీకాకుళం చేరడానికి కొన్ని గంటల సమయాన్ని వృధాచేసుకొనే దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పదుతుంది. దీంతో రైల్వే అధికారులను తిట్టుకుంటూ ఊసురోమంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అండర్ పాస్ లో చేరిన నీరు నాగావళి నదిలోకి వెళ్లే విధంగా ఏర్పాట్లు చేసినప్పటికీ అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి కాకపోవడంతో ఈ తీవ్ర సమస్య ఏర్పడుతుందని ప్రయాణికులు రైల్వే అధికారులు స్పందించి అసంపూర్తిగా ఉన్న పనులను తక్షణమే పూర్తి చేయాలని పేడాడ రామ్మోహన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం నాయకులు పైడి మురళి మోహన్, మండల నాయకులు పొన్నాడ బాలకృష్ణ, యశ్వంత్, నాయుడు, రాజు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.