సెమీక్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న పెండ్యాల శ్రీలత

అనంతపురం అర్బన్ నియోజకవర్గం: స్థానిక తపోవనం అల్లూరి సీతారామరాజు కాలనికి చెందిన ఫాస్టర్ జోసఫ్ సుస్మితల ఆహ్వానం మేరకు సెమీ క్రిస్మస్ వేడుకలలో జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏసుప్రభు లోకరక్షకుడని, ఆయన చూపిన మార్గం సదా ఆచరణీయం ఏసుప్రభు పుట్టినరోజు అయిన క్రిస్మస్ శాంతి సంతోషాలు ప్రేమ త్యాగాలకు చిహ్నమని అన్నారు. ఈ కార్యక్రమంలో వీరమహిళలు జనసేన నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది.