స్థానిక సమస్యల పరిష్కారానికై జనసైనికులు నిరంతరం పోరాడాలి: నాదెండ్ల మనోహర్

మంగళగిరి: ప్రజాసమస్యలపై జనసైనికులు నిరంతరం పోరాటం చేయాలని జనసైనికులకు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. శుక్రవారం మంగళగిరి కార్యలయంలో నాదెండ్ల మనోహర్ ను జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి కలిశారు. ఈ సందర్భంగా 22వ డివిజన్ పరిధిలోని రాఘవయ్యపార్కు దుస్థితిపై అదే విధంగా స్థానిక సమస్యలపై జనసేన పార్టీ చేసిన పోరాటం.. తత్ఫలితంగా వెంటనే ప్రభుత్వం స్పందించి రాఘవయ్యపార్కుని పూర్తిస్థాయిలో ఆధునీకరణ చేయటానికి పనులు ప్రారంభించటం వంటి విషయాలను ఆళ్ళ హరి మనోహర్ కు వివరించటం జరిగింది. ఈ నేపధ్యంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదురుకుంటున్న స్థానిక సమస్యలపై జనసైనికులు పోరాటం చేయాలని, సమస్య పరిష్కారం అయ్యేవరకు ప్రజలకు అండగా నిలవాలని కోరారు. అదేవిధంగా క్రియాశీలక సభ్యత్వ నమోదు ఎలా జరుగుతుందో అడిగి తెలుసుకున్నారు. జనసేన పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో ప్రతీ ఒక్కరినీ క్రియాశీలక సభ్యునిగా చేర్చే విధంగా కృషి చేయాలని పార్టీ శ్రేణుల్ని కోరారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరిని నాదెండ్ల మనోహర్ ప్రత్యేకంగా అభినందించారు.