పితాని రామకృష్ణ కు నివాళులర్పించిన పితాని బాలకృష్ణ

ముమ్మిడివరం: ముమ్మిడివరం మండలం చినకొత్తలంక గ్రామానికి చెందిన పితాని రామకృష్ణ(38) సోమవారం హార్ట్ ఎటాక్ తో అకాల మరణం చెందారు. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ, రామకృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి 10,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. జనసేన పార్టీ వారికి ఎప్పుడు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సానబోయిన మల్లికార్జునరావు, చిట్టూరి దొరబాబు విత్తనాల అర్జున్, సానబోయిన వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు.