పలు కుటుంబాలను పరామర్శించిన పితాని

ముమ్మిడివరం, రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యలు మరియు ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ఐ.పోలవరం మండలం పెద్దమడి గ్రామంలో ప్రమాదవశాత్తు మరణించిన పాటి వెంకన్న చిత్రపటానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు మరియు కేశనకుర్రు కొత్త కాలనీ గ్రామంలో పాము కాటుకు గురై చనిపోయిన పోనుగుమట్ల ఏడుకొండలు చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి 2000, వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ముమ్మిడివరం నియోజకవర్గంలో మున్సిపాలిటీ 19 వార్డ్ లో అకాల మరణం చెందిన దొమ్మేటి కుమార్ స్వామి కుటుంబ సభ్యులను పరామర్శించారు మరియు అదే వార్డుకు చెందిన గుండెపోటుతో మరణించిన చల్లపల్లి శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి వెంట మండల అధ్యక్షులు మద్దంశెట్టి పురుషోత్తం, జక్కంశెట్టి పండు, రాయపరెడ్డి బాబీ, దూడల స్వామి, కడలి కొండ, సవరపు వెంకటేష్, విత్తనాల రవి, గాంజా ఏసు, మల్లిపూడి రాజా, కోన సోము, తాళ్లూరి ప్రసద్ తదితరులు పాల్గొన్నారు.