అనారోగ్యంతో బాధపడుతున్న జనసైనికుడికి అండగా పిఠాపురం జనసేన నాయకులు

పిఠాపురం నియోజకవర్గం, గొల్లప్రోలు మండలం, చెందుర్తి గ్రామంకి చెందిన జనసైనికుడు, జనసేన వీరాభిమాని అయిన గోవిందు రాజులు కొంతకాలంగా అనారోగ్యానికి గురికావడం తన జీవనఉపాధికి భంగం కలగడంతో బాధపడుతున్న జనసైనికుడిని జనసేన తరుపున పరామర్శించి మేమున్నాం అని అతనకి ఆర్ధిక సహాయాన్ని, మనోధైర్యన్నీ అందించారు జనసేన నాయకులు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర మత్స్యకార విభాగ కార్యదర్శి కంబాల దాసుగారు, జనసేన నాయకులు మత్సా అప్పాజీ, పల్లేటి బాపన్న దొరగారు, మర్రి దొరబాబు, గొల్లపల్లి వీరబాబు, ఓరుగంటి పెద్దకాపు, ఇంటి వీరబాబు, గుండ్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.