జనసైనికునికి అండగా పోలవరం జనసేన

పోలవరం, జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడు గ్రామంలో జనసైనికుడు పాయం ఆనంద్ కుమార్ కొంతకాలంగా అనారోగ్యపాలవ్వడంతో వారి కుటుంబాన్ని పోలవరం నియోజకవర్గం ఇంచార్జి చిర్రి బాలరాజు మరియు జనసేన నాయకులు చిర్రి రాంపండు, చిర్రి కృష్ణయ్య, ప్రేమ్ కుమార్, పూనెం వంశీ, పండు హరికృష్ణ మరియు జనసైనికులు వారి ఇంటికి వెళ్లి పరామర్శించి ఆరోగ్య స్థితి తెలుసుకుని తమవంతు సహాయంగా బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులు మరియు 3,000/- రూపాయల నగదు అందించారు. మీ కుటుంబానికి జనసేన ఎప్పుడు అండగా ఉంటుందని ధైర్యంగా ఉండాలని చిర్రి బాలరాజు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు కార్యకర్తలు పాల్గొన్నారు.