నియోజకవర్గంలో రెండు కుటుంబాలను పరామర్శించిన పోలిశెట్టి చంద్రశేఖర్

రామచంద్రపురం పట్టణము 5 వ వార్డు జనసైనికుడు టీయాకుల దుర్గా ప్రసాద్ తండ్రి శ్రీ రవి బైక్ యాక్సిడెంట్ జరిగి తలకు తీవ్రమైన గాయాలు అవ్వడం జరిగింది. రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ రాయవరం K.V.R హాస్పిటల్ కి వెళ్లి శ్రీ రవిని కలసి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవడం జరిగింది.
కుడుపూరు గ్రామం వాస్తవ్యులు శ్రీ నందికోళ్ళ దుర్గ ఆదినారాయణ భార్య సత్యదుర్గ అనారోగ్యం కారణంగా ఇటీవల స్వర్గస్తులైనారు. వారి కుటుంబ సభ్యులను రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ వెళ్లి పరామర్శించడం జరిగింది. కుడుపూరు, దంగేరు గ్రామాల జనసేన పార్టీ MPTC నందికోళ్ళ వీరవెంకట నాగేంద్ర, తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి బుంగా రాజు, వెల్ల గ్రామం 1 MPTC చిక్కాల స్వామి, రాంబాబు నాయుడు, కనకాల వెంకటేష్, గిరి, తదితర జనసైనికులు వెళ్లి పరామర్శించడం జరిగింది.