ఉద్యోగులతో పాజిటివ్‌ ప్రచారం చేయిస్తున్న Facebook ..!

వినియోగదారుల భద్రత కంటే డబ్బుకే ప్రాధాన్యం ఇస్తోందని ఫేస్‌బుక్‌పై మాజీ ఉద్యోగి ఫ్రాన్సెస్‌ హౌగెన్‌, ప్రజావేగుగా మారిపోయి మీడియాకు వెల్లడించిన సంగతి తెలిసిందే. సాక్ష్యాధారాలతో సహా ఆమె మీడియా ముందుకు రావడం సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారం అమెరికా పార్లమెంట్‌కి చేరడంతో ఫేస్‌బుక్‌ గురించి పాజిటివ్‌ ప్రచారం చేయాలని ఉద్యోగులను బతిమాలుతోంది యాజమాన్యం. ఆరోపణల్ని ఖండించడం, ఫేస్‌బుక్‌ గురించి కుటుంబసభ్యులతో పాటు అందరితోనూ మంచిగా చెప్పాలంటూ ఉద్యోగులకు పదేపదే చెబుతోంది. కిందిస్థాయి ఉద్యోగులకు ఈ అంశాలతో కూడిన మెమోలను జారీ చేసిందని ది టైమ్స్‌ ఒక కథనం ప్రచురించింది. అంతేకాదు హౌగెన్‌ను ఎవరూ విమర్శించకూడదనే కఠిన ఆదేశాలు ఉద్యోగులకు జారీ చేసినట్లు సమాచారం.