అరణ్య ప్రాంతాల కంటే ఆంధ్రప్రదేశ్ లో కరెంటు కోతలు ఎక్కువ: జనసేన

*రోడ్లు, కరెంటు, నీరు లేక ఏపీ లో నరకం,10 పబ్లిక్ పరీక్షల విద్యార్థుల అగచాట్లు *తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యల్ని స్వాగతిస్తున్నాం కిరణ్ రాయల్
*మన రాష్ట్రాన్ని నవ్వుల పాలు చేశారు జనసేన పార్టీ ఆగ్రహం

వైసీపీ ప్రభుత్వం (దోపిడి రాజ్యం) వచ్చాక మన ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు, కరెంటు, నీరు లేక ప్రజలు నరకాన్ని అనుభవిస్తున్నారని.. ఈ పరిస్థితిని చూసి.. పక్క రాష్ట్రాల వారు మనపై జాలిపడి, నవ్వుకుంటున్నారని.. జనసేన పార్టీ తిరుపతి అసెంబ్లీ ఇంచార్జ్ కిరణ్ రాయల్ విమర్శించారు..

ప్రెస్ క్లబ్ లో శుక్రవారం జరిగిన మీడియాసమావేశంలో.. మీడియాతో జనసేన నాయకులు రాజా రెడ్డి, డా. బాబు, బాబ్జి, సుమన్ బాబు, మునస్వామి, బలరాం, మనోజ్ తదితరులతో కలిసి కిరణ్ మాట్లాడుతూ.. తెలంగాణ మంత్రి సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ మన రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది, దయనీయస్థితిలో ఆంధ్ర ప్రదేశ్ కొట్టుమిట్టాడుతోందని చేసిన వ్యాఖ్యలను తాము స్వాగతిస్తున్నామని తెలిపారు.

ఈ కరోనా(లాక్ డౌన్) 3 సంవత్సరాల కాలం పాటూ పాఠశాలలు సరిగా నిర్వహించక పోవడంతో విద్యార్థులు నష్టపోయారని, అలాంటి పరిస్థితులలో ఈ సారి పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కరెంటు కోతతో ఇబ్బందులు పడుతూ వైసీపీ ప్రభుత్వాన్ని తిట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు..

వైసిపి వచ్చాక రోడ్లు అధ్వానంగా తయారైతే, రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో జనసేన ఆధ్వర్యంలో బిచ్చమెత్తి రోడ్లు వేయించామని గతాన్ని గుర్తు చేశారు..

ఈ వేసవి తాపంతో సామాన్యులు కష్టాలు పడుతుంటే తాగడానికి నీరు కూడా సరఫరా చేయని స్థితిలో ప్రభుత్వం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.. పదో తరగతి పరీక్షల పేపర్ లీక్ అయితే సంబంధిత వారి పేర్లను బహిర్గతం చేయకపోవడానికి కారణం ఏంటని ప్రశ్నించారు.. ఈ చేతగాని సీఎం జగన్ పరిపాలన ఇంకెన్నాళ్లు అని ప్రజలు బాధపడుతున్నారన్నారు.. చేతగాని వైసీపీ ప్రభుత్వం గద్దె దిగితే రాష్ట్రం బాగుపడుతుందని ఎద్దేవా చేశారు.. రాష్ట్రంలో పరిశ్రమలు లేక ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ఆకలి మంటలు అనుభవిస్తున్నారని ధ్వజమెత్తారు.