రైతులతో ప్రధాని భేటీ

కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేస్తున్న వేళ.. ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు (శుక్రవారం) తొమ్మిది రాష్ట్రాలకు చెందిన అన్నదాతలతో భేటీ భేటీకానున్నారు. వర్చువల్‌ విధానంలో మధ్యాహ్నం 12 గంటలకు రైతులతో ప్రధాని సంభాషించనున్నారు. ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద తొమ్మిది కోట్ల మంది రైతులకు శుక్రవారం రూ.18కోట్లు వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. మాజీ ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పేయి జన్మదినం సందర్భంగా.. నగదు బదిలీని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఆరు రాష్ట్రాల రైతులతో ప్రధాని రైతులతో మాట్లాడనున్నారు. కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సైతం వర్చువల్‌ విధానంలో భేటీలో పాల్గొననున్నారు. ప్రధాని వర్చువల్‌ సమావేశ సందర్భంగా బీజేపీ నాయకులు ఆయా రాష్ట్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సమావేశాల వేదికల వద్ద పెద్ద ఎత్తున స్క్రీన్లు ఏర్పాటు చేయాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఆదేశించారు. కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ బిల్లులను ఉద్దేశించి ప్రధాని మాట్లాడే అవకాశం ఉంది.