ప్రైవేటు పాఠశాలలు ఫీజుల్లో 20 శాతం తగ్గించాల్సిందే: కలకత్తా హైకోర్టు

కొవిడ్-19 కారణంగా ప్రస్తుత పరిస్థితులలొ తల్లిదండ్రులు విద్యార్థలకు ఫీజులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపధ్యంలొ పశ్చిమ బెంగాల్‌లోని ప్రైవేటు పాఠశాలలు ఫీజులలో 20 శాతం మేరకు తగ్గించాలని కలకత్తా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ వార్త  ప్రస్తుత కరొనా పరిస్థితులలొ తల్లిదండ్రులకు ఉపశమనం కలిగించే వార్తగా మారింది. తల్లిదండ్రులు ఎంతో కాలంగా ప్రైవేటు పాఠశాలల్లో ట్యూషన్ ఫీజులను తగ్గించాలని కోరుతూ వస్తున్నారు. ఈ నేపధ్యంలో తాజాగా కోర్టు వెలువరించిన తీర్పు ప్రకారం ఈ విద్యాసంవత్సరంలో ప్రైవేటు పాఠశాలలు ఫీజులు పెంచకూడదు. స్కూళ్లు ఫిజికల్ మోడ్‌లోకి వచ్చిన తరువాత తగిన ఫీజులు వసూలు చేయాలి. ఇప్పుడు వసూలు చేస్తున్న ఫీజులను 20 శాతం మేరకు తగ్గించాలి. కోల్‌కతాలోని 145 స్కూళ్లలో చదువుకుంటున్న విద్యార్థుల తరపున అందిన అభ్యర్థన మేరకు కోర్టు ఈ విధమైన తీర్పునిచ్చింది.