జనంకోసం జనసేన కార్యక్రమంలో సమస్య పరిష్కారం

సింగరాయకొండ మండలం, సింగరాయకొండలోని బుజ్జుల యలమందా రెడ్డి కాలనీ లో ఒక తల్లి తన ఆవేదన వ్యక్తం చేసింది. ఏమిటంటే ఆ తల్లికి ఇద్దరు కుమారులు, పెద్ద కుమారుడుకి ఆరు సంవత్సరాలు, చిన్న కుమారుడికి నాలుగు సంవత్సరాలు అయినప్పటికీ, ఆ తల్లి పిల్లలకి డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్ లేనందువలన ఆ పిల్లలనీ ఏ స్కూల్లో చేర్చుకోలేదు, కాలనీలో అందరి పిల్లలు స్కూల్ కి వెళ్తుంటే ఈ పిల్లలు స్కూలుకు వెళ్ళటానికి అవకాశం లేనందున అ తల్లి ప్రతిరోజు బాధపడుతూనే ఉంది. ఈ తల్లి కొడుకులు ఇద్దరు ఒంగోలు నగరంలోని రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించినప్పటికీ, పిల్లలకి డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్ కోసం ఆరు సంవత్సరాల నుంచి తిరిగి తిరిగి విసుగెత్తి పోయింది. ఈ సమస్యపై జనసేన నాయకులు చాలా బలంగా దృష్టి పెట్టి ఇద్దరు పిల్లలకి డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్ తెచ్చి ఆ తల్లికి సింగరాయకొండ మండల జనసేన నాయకులు అందజేయడం జరిగింది. ఈ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లు అందుకున్న తల్లి జనసేన పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐనా బత్తిన రాజేష్, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యుడు కాసుల శ్రీకాంత్, జనసేన నాయకులు దేవినేని బాలాజీ, దండే ఆంజనేయులు, కాసుల శ్రీనివాస్, పసుపులేటి శ్రీకాంత్, అనుమల శెట్టి కిరణ్ బాబు, కె.ఎస్.ఆర్, గుంటుపల్లి శ్రీనివాస్, నామ వెంకటేష్, షేక్ సుల్తాన్ భాష, చలంచర్ల కరుణ్ కుమార్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.