దుల్హన్ పధకం ఎత్తివేతపై కాకినాడ సిటి జనసేన ఆధ్వర్యంలో నిరసన

కాకినాడ సిటి, ప్రభుత్వం ఏర్పాటు చేసి మూడు సంవత్సరాలు పూర్తి అయినా, నేటి వరకు దుల్హన్ పధకం అమలు చేయడంలో నిర్లక్ష్యం ధోరణి అవలంబిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ జనసేన పార్టీ కాకినాడ సిటి నియోజకవర్గ ఇన్ ఛార్జ్ మరియు రాష్ట్ర పి.ఏ.సి సభ్యులు ముత్తా శశిధర్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం 4.30 గంటలకు చాట్ల చైతన్య ఆధ్వర్యంలో టుటౌన్, సూర్యారావుపేట, చిన్న మసీదు వద్ద ముస్లిం సోదర సోదరీమణులు తలపెట్టిన నిరసన కార్యక్రమం జరిగినది. ఇందులో పాల్గొన్న ముత్తా శశిధర్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఒకలాగ, ఎన్నికల తరువాత మరోలాగ ఉండటం సరికాదన్నారు. ప్రజలకు ఎన్నో సంక్షేమ పధకాలను అమలు చేస్తున్నామంటున్న ప్రభుత్వం మరి ముస్లిం సోదరీమణులకు ఈ పధకాన్ని ఆపి ఎందుకు ద్రోహం చేస్తోందో ప్రజలకు చెప్పాలన్నారు. ఈ అన్యాయాన్ని జనసేన పార్టీ ప్రతిఘటిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వీరమహిళలు రజియా బేగం, అఫిజా ఖాన్, డి.శిరీష, జనసైనికులు మొయీన్,సమీర్, వల్లీ బాషా, ఎండి. సిర్రాజ్, ఎస్.కె.కరీముల్లా, ఎస్.కె.రోషన్, రమణా రెడ్డి, ఉదయభాస్కర్, సాదనాల గంగాధర్, జి.వీరబాబు, అడబాల సత్యన్నారాయణ, ఎం.దుర్గాప్రసాద్, సురేష్, జాడా రాజులు పాల్గొనగా నగర అధ్యక్షులు సంగిశెట్టి అశోక్, జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, ప్రోగ్రాం సెక్రటరీ కర్రి నాని, మాజీ కార్పోరేటర్ ర్యాలి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.