ఘనంగా జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ

  • 2024 ఎన్నికల్లో ఆలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ గెలుపే ధ్యేయంగా పని చేస్తాం.
  • ఆలూరు నియోజకవర్గ అభివృద్ధె ధ్యేయం.

కర్నూల్ జిల్లా, ఆలూరు నియోజకవర్గం హోలగుంద మండల కేంద్రంలో ఆదివారం స్థానిక బస్టాండ్ నందు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ తెర్నకల్ వెంకప్ప హాజరయ్యారు. ముందుగా ఆలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ తెర్నకల్ వెంకప్పకు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారి చేతుల మీదుగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024వ సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి అక్కచెల్లెమ్మలు, యువకుల ఓట్లు ఆలూరు నియోజకవర్గ అభివృద్ధి ఆశయానికి అంకితం కావాలని పిలుపునిచ్చారు. అలాకాకుండా ఏ ఒక్క వ్యక్తి లాభానికి, స్వార్థానికి కాకూడదని అన్నారు. ముఖ్యంగా ఆలూరు అభివృద్ధి కోసం జనసేన పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని చెప్పారు. అలాగే అయోధ్య నగర్ నందు త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉందని కాలనీ వాసులు జనసేన పార్టీ ఇంచార్జ్ వెంకప్ప దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లి సమస్య పరిష్కరించాలని అధికారులను నిలదీయండి మీకు అండగా జనసేన పార్టీ ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ యువ నాయకులు నాగరాజు, రాజు, చిన్న, జనసైనికులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.