పూర్ణ మార్కెట్ ప్రైవేటు పరం కానివ్వం: జనసేన ధర్నా

వైజాగ్ సౌత్: దశాబ్దాల కాలంగా ఎంతో పేరు కల విశాఖపట్టనానికి తలమణికంగా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ మార్కెట్ (పూర్ణమార్కెట్) ను ప్రైవేటు భాగస్వామ్యం పద్దతిలో అభివృద్ధి చేస్తాం అంటూ నిర్వీర్యం చేయడం, ప్రైవేటు వ్యక్తులకు కట్టడం వైసీపీ ప్రభుత్వం యొక్క దివాళా మరియు దగుల్బాజీ తనానికి ప్రతీక అని, తక్షణమే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని జనసేన పార్టీ నాయకులు శివ ప్రసాద్ రెడ్డి డిమాండ్ చేసారు, స్థానిక పూర్ణమార్కెట్ ప్రధానద్వారం వద్ద జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ధర్నా నిర్వహించి, పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ విశాఖపట్నంలో ఉన్న ప్రధాన ఆస్తులను ఈ ప్రభుత్వం తాకట్టు పెట్టిందని, ఋషికొం డను నాశనం చేసింది ఇప్పుడు ఈ నాయకుల కన్ను పూర్ణర్ణమార్కెట్ పై పడిందని చేతనైతే ప్రభుత్వం మార్కెట్ ను అభివృద్ధి చేయాలి, కావాల్సిన వసతులు కల్పించాలి కానీ ఇలామార్కెట్లు కూడా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడితే ఎలా అని ప్రశ్నించారు. కమ్యూనిస్ట్ పార్టీనాయకు లు గంగాధర్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం దివాళా ప్రభుత్వం అని, డబ్బులు కావాల్సిన ప్రతిసారి ఒక ఆస్తిని తాకట్టు పెడ్తున్నారు అని ఈ విధానం మంచిది కాదు అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రఘు, శ్రవణ్, తెలుగు అర్జున్, రూపా, సురేష్ తదితరులు పాల్గొన్నారు.