పేర్ని నానీ మాటలను తీవ్రంగా ఖండించిన జనసేన నాయకులు ఖాసీం సైదా

గుంటూరు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి పేర్ని నాని మీడియా ముఖంగా మాట్లాడుతూ ప్రజారాజ్యం పార్టీకి పవన్ కళ్యాణ్ ద్రోహం చేశాడని అదేవిధంగా చిరంజీవిని తక్కువగా చూపిస్తూ మాట్లాడారని పవన్ కళ్యాణ్ మాట్లాను వక్రీకరించి మాట్లాడడం చూస్తా ఉంటే మంత్రి పదవి పోయినతరువాత పేర్ని నానికి మతి బ్రమించినట్టు ఉందని అందుకే తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడని గుంటూరు జిల్లా జనసేన సంయుక్త కార్యదర్శి ఖాసీం సైదా అన్నారు. మీరు ఎన్ని అబద్దాలు చెప్పిన మెగా అభిమానులు అందరూ ఒక్కటే అని అందరం 2024లో జనసేన పార్టీ గెలుపుకు కృషిచేస్తామని చిరంజీవి ఆశయాలను కొనసాగించడానికె పవన్ కళ్యాణ్ జనసేనపార్టీ స్థాపించారని మీరు ఎన్ని కుట్రలు పన్నినా 2024లో జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేసి తీరుతామని మీకు ఓటమి భయం పట్టుకునే ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అసలు మీ పరిపాలనలో ఏ ఒక్కరూ సుఖంగా లేరని సంక్షేమ పథకాల పేరుతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారని, అమలు చేసే ప్రతి పథకం లోకూడా సవాలక్ష షరతులు పెడుతున్నారని,రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ ఎదురుచూస్తున్నారని, మరొక సారి పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు.