క్విట్ ఇండియా ఉద్యమం లాగా క్విట్ ఆంధ్ర ఉద్యమం: గాదె

గుంటూరు: గుంటూరులో స్థానిక లాడ్జి సెంటర్ లో ఉన్న డా. అంబేత్కర్ విగ్రహం దగ్గర బుధవారం రాష్ట్ర జెనరల్ సెక్రెటరీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, గుంటూరు సిటీ అధ్యక్షులు నేరెళ్ళ సురేష్ ఫ్లకార్డ్స్ తో నినాదాలు ఇస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గాదె మాట్లాడుతూ..
భారతదేశ స్వతంత్రం కోసం ఆనాడు “క్విట్ ఇండియా ఉద్యమం” చేసినట్లు ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం “క్విట్ ఆంధ్రా” నినాదంతో జనసేన పార్టీ ఈ ఆగస్టు నెలలో ఉద్యమాలు చేస్తామని జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు పిలుపునివ్వడం జరిగింది. “ఆనాడు” దేశ సంపదను ఆంగ్లేయులు దోచుకున్న విధంగా “ఈనాడు” వైయస్సార్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్రంలోని సంపదను దోచుకుంటున్న తీరును ప్రజలు గమనించినప్పటికీ అధికార మదంతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ వారి ఇష్టానుసారంగా సంపదను దోచుకున్న దానికి వ్యతిరేకంగా ఈ ఉద్యమం చేయవలసిన అవసరం ఉన్నట్లుగా జనసేన పార్టీ నాయకులు చెప్పడం జరిగినది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రజల ఆస్తులను ప్రజలకు సంబంధించిన వనరులను వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆయన అనుచరులు దోచుకోవడం తప్ప రాష్ట్ర అభివృద్ధి రాష్ట్రంలో పాలన అనేది మర్చిపోయారు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి అతని అనుచర గణం ఆంధ్రను వదిలి వెళ్ళిపోవాలి లేదా ప్రజలు వారిని ఆంధ్రా నుంచి వెళ్లగొట్టాలి అనే నినాదమే ఈ క్విట్ ఆంధ్ర ను కొనసాగిద్దామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, కార్పొరేటర్లు, నగర నాయకులు, వీరమహిళలు, జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.