రాధేశ్యామ్‌ ప్రీ టీజర్ విడుదల..

ప్రభాస్ – పూజా హెగ్డే కలయికలో రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తున్న పాన్ మూవీ రాధేశ్యామ్. యువీ క్రియేషన్స్, గోపి మూవీస్ వారు సంయుక్తం గా నిర్మిస్తున్న ఈ మూవీ ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉండగా..ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ను ఫిబ్రవరి 14 న ప్రేమికుల రోజు సందర్భాంగా రిలీజ్ చేయబోతున్నారు.

దీనికి సంబదించిన ప్రీ టీజర్ ను శనివారం విడుదల చేసి అభిమానుల్లో ఆసక్తి నింపారు. “మీకు తెలిసిన మనిషి ఇతడు.. ఈ సారి అతడి హృదయాన్ని తెలుసుకుందాం” అంటూ రెబల్‌స్టార్‌ నడిచివస్తోన్న వీడియోని రిలీజ్‌ చేసింది. ఇంకా పూర్తి స్థాయి ఫస్ట్‌ గింప్స్‌ను ఫిబ్రవరి 14న రిలీజ్‌ చేస్తామని ప్రకటించింది.