జవహర్‌లాల్ నెహ్రూకి నివాళర్పించిన రాహుల్ గాంధీ

భారత తొలిప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, తన తాత జవహర్‌లాల్ నెహ్రూ 131వ జన్మదినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ న్యూఢిల్లీలోని శాంతి వనంలో ఉన్న నెహ్రూ సమాధి వద్ద ఇవాళ ఉదయం అంజలి ఘటించారు. జవహర్‌లాల్ నెహ్రూ 1889, నవంబర్ 14న ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జన్మించారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత 1947, ఆగస్టు 15 మొదటి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 1964, మే 27న ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా నవంబర్ 14ను బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నారు.