రుయా ఘటన బాధ్యుడు కుటుంబాన్ని పరామర్శించిన రైల్వే కోడూర్ జనసేన

  • తిరుపతి రుయా ఆస్పత్రి అంబులెన్స్ సిండికేట్ మాఫియా
  • యావత్ తెలుగు రాష్ట్రాలను కంటతడి పెట్టించిన హృదయ విదారక ఘటన బాధ్యుడు కుటుంబాన్ని పరామర్శించిన రైల్వే కోడూర్ జనసేన పార్టీ

రైల్వేకోడూరు నియోజకవర్గం, పెనగలూరు మండలం, కొండూరు గ్రామం లోని ఎస్టీ కాలనీలో నివాసముంటున్న కంభం పాటి నరసింహులు కుమారుడు జాషువా (పది సంవత్సరాలు) ఆరోగ్యం బాగాలేక చికిత్స పొందుతూ తిరుపతి రుయా ఆస్పత్రిలో మరణించడం జరిగింది. మరణించిన బాలుడి మృతదేహాన్ని తన స్వస్థలంకు తీసుకురావడానికి 20 వేల రూపాయలు ప్రైవేట్ అంబులెన్స్ వాళ్లు డిమాండ్ చేయడం జరిగింది. తోటలో కాపలాదారుడిగా వృత్తి జీవనం సాగిస్తున్న నర్సింహులు తన ఓనరు ఆంబులెన్స్ పంపిస్తాను అని చెప్పగా ….తిరుపతి రుయా ఆస్పత్రిలో సిండికేట్ మాఫియాగా ఉన్న అంబులెన్స్ వాళ్లు తీవ్ర పదజాలంతో నర్సింహులును తిడుతూ మృతదేహాన్ని తమ ఆంబులెన్స్లో తప్ప మిగతా అంబులెన్స్లో తరలించడానికి వీలులేదని అతణ్ణి తీవ్ర మనోవేదనకు గురి చేయడం జరిగింది. చివరికి చేసేదేమీ లేక స్కూటర్ మీద పది కిలోమీటర్లు బాలుడి శవాన్ని సభ్యసమాజం తలదించుకునే విధంగా తీసుకువెళ్లి తన ఓనరు పంపించిన ఆంబులెన్స్ లో తన ఇంటికి తీసుకు పోవడం జరిగింది. ఈ క్రమంలో కూడా స్కూటర్ మీద బాలుడి మృతదేహాన్ని తీసుకెళ్లే క్రమంలో కూడా స్కూటరు నడుపుతున్న వ్యక్తిని కూడా పరుష పదజాలంతో తిడుతూ అతన్ని రెండు దెబ్బలు కూడా వేయడం జరిగింది. ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్న వైసీపీ ప్రభుత్వం ఏ స్థాయిలో ప్రజల కోసం పని చేస్తుందో ఈ సంఘటన తెలియజేస్తోంది. రాష్ట్రంలో అన్ని ఆస్పత్రుల దగ్గర దాదాపు ఇదే పరిస్థితి. కావున ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరుచుకుని “ఆంబులెన్స్ సిండికేట్ మాఫియా” మీద ఉక్కుపాదం మోపాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం. గురువారం రైల్వేకోడూరు జనసేన పార్టీ తరపున బాధిత కుటుంబాన్ని పరామర్శించి చిరు సాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మర్రి రెడ్డిప్రసాద్, మాదాసు నరసింహ రాయలు, పూజారి మనీ రాజేష్, జనసేన దళిత నాయకులు నగిరి పాటి మహేష్, మరియు కొండేటి వెంకటరమణ, సువ్వారపు హరిప్రసాద్ పాల్గొన్నారు.