రాజమౌళి అభ్యంతరం.. చిరంజీవి రిక్వెస్ట్

మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో రామ్ చరణ్ ప్రత్యేక పాత్ర పోషించనున్నాడు. ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్ కలిసి సుమారు 30-45 నిమిషాల కీలకమైన పాత్ర పోషించనున్నారు. తండ్రి, కొడుకులు ఇద్దరూ కలిసి ఈ సినిమాలో నటించాలని చిరంజీవి భార్య సురేఖ కోరిన కోరిక మేరకే ఆ విధంగా సినిమాను ప్లాన్ చేస్తున్నట్టు ఫిలింనగర్ టాక్.

ఇప్పటికే చిరంజీవి, రామ్ చరణ్ కలిసి మగధీర, బ్రూస్ లీ, ఖైదీ నంబర్ 150 సినిమాల్లో నటించారు. కాకపోతే మగధీర, బ్రూస్ లీ సినిమాల్లో చిరంజీవి ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఖైదీ నంబర్ 150 సినిమాలో రామ్ చరణ్ ఒక పాటలో తండ్రి చిరుతో కలిసి స్టెప్పేశాడు కానీ ఆచార్య సినిమా అలా కాదు. అందుకే చిరంజీవి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి అనుకుంటున్నాడు.

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతా రామరాజు పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆచార్య సినిమాకి, ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకి మధ్య డేట్స్ కుదరకనో, లేక ఆచార్య చిత్రంలో రామ్ చరణ్ నటించినట్లయితే ఈ చిత్రం ఆర్ఆర్ఆర్ సినిమా కంటే ముందు విడుదల అవుతుంది కనుక అలా అవడం వల్ల ఆర్ఆర్ఆర్ సినిమా క్రేజ్ తగ్గుతుందేమో అని అనే అనుమానంతోనో రాజమౌలి అభ్యంతరం వ్యక్తం చేశాడంట.

కానీ, చిరంజీవి మాత్రం రాజమౌళితో  వ్యక్తిగతంగా మాట్లాడారంట. తాము ఇద్దరం కలిసి నటించడం అనేది సురేఖ కోరిక అని, మళ్లీ వారికి ఇలాంటి అవకాశం లభిస్తుందో లేదో తెలియదని చిరు రాజమౌళికి వివరించారంట. అలా చిరు మాట కాదనలేక ఆయన అభ్యర్థనకు రాజమౌళి ఓకే చెప్పారని టాలీవుడ్ టాక్.