హరిరామ జోగయ్య దీక్షకు సంఘీభావం తెలిపిన రాజంపేట జనసేన

అన్నమయ్య జిల్లా, రాజంపేట పట్టణంలో కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు చేగొండి హరిరామ జోగయ్య చేస్తున్న దీక్షకు మద్దతుగా కాపు సంక్షేమ సేన, యువసేన, మహిళా విభాగం అన్నమయ్య జిల్లా తరపున అందరూ కలిసి సంఘిభావం తెలుపుతూ రాజంపేట ఆర్&బి బంగాళా ఎదుట ఏర్పాటు చేసి దీక్ష శిబిరానికి అధ్యక్షత వహించిన అబ్బిగారి గోపాల్ నేతృత్వంలో చేపట్టిన కార్యక్రమానికి జనసేన తరపున నాయకులు, జనసైనికులతో కలిసి సంఘిభావంగా రామ శ్రీనివాస్ మాట్లాడుతూ కాపు, బలిజ, తెలగ, ఒంటరి ఇలా ఉపకులాలకు జరిగిన అన్యాయం గురించి 87 సంవత్సరాల వయ్యసు గొప్ప వ్యక్తి చేపట్టిన కార్యక్రమానికి వైసీపీ పాలకులు, ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తీవ్రంగా ఖడిస్తూ గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాలుగా పరిశీలించి 5% అవలంబించిన రిజర్వేషన్ అర్దాంతరంగా ఆపేసిన వైనాన్ని తప్పుపడుతూ వైసీపీ ప్రభుత్వ పాలకుల్లో చిత్తశుద్ధి లేకనే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు చేపట్టారు వారి పరిపాలన సక్రమంగా ఉంటే ఇటువంటి దీక్ష కార్యక్రమాలు చెయ్యాల్సిన అవసరం లేదని స్పష్టం వెల్లడిస్తూ కాపు జాతి హక్కుగా ఏర్పడిన రిజర్వేషన్ వెంటనే పునరుద్దించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా కాపుల డిమాండ్లకు వైసీపీ ప్రభుత్వం స్పందించకపోతే ఈ ఉద్యమాలను రాష్ట్ర వ్యాప్తంగా ఉదృతం చేస్తామని జనసేన తరపున హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, యువకులు అన్నమయ్య జిల్లాలోని అన్ని ప్రాంతాల వారు మరియు వివిధ రకాల రంగాల్లోని సంఘం పెద్దలు, నాయకులు, న్యాయవాదులు మద్దతుగా సంఘిభావం తెలపడం జరిగింది.