రజినీ పొలిటికల్ ఎంట్రీ.. అన్నయ్య బెస్ట్ విషెస్

సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ అరంగేట్రం ఖరారైన వేళ.. రజినీ ఎంట్రీ కోసం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 31న పార్టీని ప్రకటిస్తా అని రజినీకాంత్ ప్రకటించిన విషయం తెల్సిందే. జనవరిలో పార్టీ లాంచ్ ఉంటుందని రజినీ చెప్పడంతో తమిళనాట చర్చ మొదలైంది. ప్రజల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న రజినీకాంత్ పోటీచేస్తే తమిళ రాజకీయాలే మారిపోతాయన్న చర్చ సాగుతోంది. అయితే రజినీకాంత్ ఎంట్రీని కొంతమంది స్వాగతిస్తుంటే మరి కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. రాజకీయాల్లోకి వెళుతున్న సందర్భంగా సూపర్ స్టార్ బెంగళూరులో నివాసముంటున్న తన సోదరుడు సత్యనారాయణను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. సత్యనారాయణ.. రజినీకి శాలువా కప్పి బెస్ట్ విషెస్ అందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇన్నాళ్లు సూపర్ స్టార్ గా అలరించి అశేష జనాదరణ సొంతం చేసుకున్న రజినీకాంత్ ఇక ఇప్పటి నుండి ఆధ్యాత్మిక రాజకీయంలో ఎలా రాణిస్తారో చూడాలి.