రాజోలు జనసేనలో చేరికలు

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, ఆశయాలు, ఆయన చేసే సేవా కార్యక్రమాలు, కులాలను కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయాలకు ఆకర్షితులై ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజోలు నియోజకవర్గం నుండి రాజోలు గ్రామానికి చెందిన ఎస్సి దళిత సామాజికవర్గానికి చెందిన గొల్లమందల పూర్ణచంద్రరావు కెనరా బ్యాంక్ మేనేజర్ గా పనిచేస్తూ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కందులు దుర్గేష్, జనసేన పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ శ్రీమతి పాలవలస యశస్వినీ సమక్షంలో జనసేనలో పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దిరిశాల బాలాజీ, రాష్ట్ర మత్స్యకార విభాగ కార్యదర్శి పొన్నల ప్రభ, జిల్లా కార్యదర్శి గుండా బత్తుల తాతాజీ, మండల అధ్యక్షులు గుబ్బల పణి కుమార్, మల్లిపూడి సత్తిబాబు, దొడ్డ జయరాం, పినిశెట్టి బుజ్జి, ఎల్లమెల్లి ఆనందరాజు, ఎంపీటీసీ ఉండపల్లి అంజి, ఉలిశెట్టి లక్ష్మణ్, పిప్పల లక్ష్మణ్, ఆర్ శ్రీను, వెంకన్న బాబు, వి చిన్ని, గెడ్డం తిలక్ పాల్గొన్నారు. మరియు ఆయనతో పాటు వైసీపీ, టీడీపీ పార్టీల నుండి 30 మంది దళిత నాయకులు పార్టీలో చేరడం జరిగింది.