అన్నమయ్య ప్రాజెక్ట్ దిగువ ప్రాంతాల్లో పర్యటించిన రామ శ్రీనివాస్

రాజంపేట: అన్నమయ్య ప్రాజెక్ట్ వరద బాధిత ప్రాంతాల్లో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, స్థానికులతో కలిసి జనసేన నాయకులు రామ శ్రీనివాస్ అక్కడ ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరద తాకిడికి ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో దెబ్బతిని ప్రమాదానికి గురై 2 సంవత్సరాల కాలం కావస్తోంది. అప్పట్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 6 నెలల్లోనే ప్రభుత్వం తరపున వరద బాధితులను అన్ని రకాలుగా ఆదుకుంటామని హామి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారు కూడా ఒక నెలలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి భాదితులకు నివాసం కల్పిస్తామని హామీ ఇచ్చి నెల రోజులు గడచిపోయి 2వ నెల జరుగుతున్నా అరకొర ఇళ్ళ నిర్మాణ పనులు చేస్తూ.. ప్రజలకు మాయ మాటలు చెప్తూ.. పబ్లిసిటీ పెంచుకుంటున్నారు తప్ప అక్కడ పనులు అంతంత మాత్రమే జరుగుతున్నాయని ప్రభుత్వం, సంబంధిత శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, వెంటనే అన్ని రకాలుగా అక్కడి ప్రాంత ప్రజలను ఆదుకోవాలని జనసేన పార్టీ తరపున రామ శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జనసైనికులు, స్థానికులు పాల్గొన్నారు.