అతికారి దినేష్ ఆధ్వర్యంలో రంజాన్ ఇఫ్తార్ విందు

అన్నమయ్య జిల్లా, రాజంపేట పట్టణంలోని సిటీ కళ్యాణ మండపంలో ఆదివారం జనసేన అసెంబ్లీ నాయకులు అతికారి దినేష్ ఆధ్వర్యంలో ముస్లిం మైనారిటీలకు రంజాన్ ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పొలిట్ బ్యూరో సభ్యులు అర్హంఖాన్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శులు నాయుబ్ కమల్, తాతంశెట్టి నాగేంద్ర, పార్లమెంట్ జనసేన నాయకులు ముఖరం చాంద్, కడప అసెంబ్లీ ఇంచార్జీ సుంకర శ్రీనివాస్, రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన, ఉమ్మడి కడప జిల్లా లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు కత్తి సుబ్బరాయుడు, రాజంపేట జనసేన నాయకులు వేంకటేశ్వర రావు, రెడ్డి రాణి, ఆకుల నరసయ్య, గురివిగారి వాసు, ఆవుల నాగరాజ, పసుపులేటి కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేన అసెంబ్లీ నాయకులు అతికారి దినేష్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో పవన్ కళ్యాణ్ అమితంగా ఇష్టపడే ముస్లిం మైనారిటీలకు ఇఫ్తార్ విందు భోజనం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని అన్నారు. జనసేన నాయకులు ముఖరం చాంద్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి భజన చేసిన తన సామాజిక వర్గం పూర్తిగా మోస పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జనసేన అధికారంలోకి వచ్చి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంద న్నారు. నాయుబ్ కమల్ మాట్లాడుతూ మైనారిటీలను జగన్ మోహన్ రెడ్డి నట్టేట ముంచారని ఆరోపించారు. పాలకులను ప్రశ్నించే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే పాలన అద్భుతంగా ఉంటుందని అన్నారు. తాతంశెట్టి నాగేంద్ర మాట్లాడుతూ మా నమ్మకం నువ్వే నంటూ గుబిలి తీసే వారిలా వారి ఎమ్మెల్యేలు ఇండ్ల చుట్టూ సిగ్గు లేకుండా తిరుగుతున్నారని, మా నమ్మకం జగన్మోహన్ రెడ్డి కాదని పవన్ కళ్యాణ్ అని అన్నారు. కీర్తన మాట్లాడుతూ ముస్లింలను జగన్ మోహన్ రెడ్డి మోసం చేసారని, పవన్ మైనారిటీ కౌలు రైతులకు, మైనారిటీ పిల్లలకు సహాయం చేశారని ఆయనకు ముస్లిం మైనారిటీలు అండగా ఉండాలని కోరారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన ముస్లింలకు నమాజ్ అనంతరం భారీగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అతికారి దినేష్ ని శాలువా, బొకేతో జనసేన ముస్లిం యువత సత్కరించారు.