కీర్తన గోల్డ్ లోన్స్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న రామశ్రీనివాస్

రాజంపేట, ఘనంగా ప్రారంభించబడిన కీర్తన గోల్డ్ లోన్స్ అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం పరిధిలోని టి సుండుపల్లి మండల కేంద్రంలో ఎస్ బి ఐ ఎదురుగా కీర్తన గోల్డ్ లోన్స్ నూతనంగా ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ నాయకులు రామ శ్రీనివాస్ పాల్గొని ఆయన చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా ఈ కీర్తన గోల్డ్ లోన్స్ ప్రారంభించిన యజమాన్యాన్ని ఆయన అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ కీర్తన గోల్డ్ లోన్స్ లో తక్కువ వడ్డీకి అధిక రుణం అసలు మరియు వడ్డీ లోన్ తీసుకున్న 9 నెలల తర్వాత ఒకేసారి చెల్లించే అవకాశం ఉందన్నారు. అలాగే బంగారు ఆభరణాల తనఖాపై మరియు ఆభరణాల కొనుగోలు కూడా లోన్స్ సౌకర్యం ఉంటుందన్నారు. అతి తక్కువ సమయంలో అధిక లోను సదుపాయం కూడా ఉందన్నారు. ఈ కీర్తన గోల్డ్ లోన్స్ కిమీ గోల్డ్ లోన్ బదిలీ చేసి ఎక్కువ అమౌంట్ తక్కువ వడ్డీతో ఇవ్వబడుతుందన్నారు. ఈ కీర్తన గోల్డ్ లోన్స్ లో ఎటువంటి ప్రాసెసింగ్ ప్లీజ్ లేదన్నారు. ఈ అవకాశాన్ని అన్నమయ్య జిల్లా ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ పూజారి నాగరాజ, అస్టెంట్ మేనేజర్ ఆంజనేయులు, ఆర్ ఓ శ్రీకాంత్, రెడ్డిబాబు, అశోక్, కుమార్ స్వామి, నాగేష్, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.