రష్మిక సూపర్ చెఫ్‌..

మెగా కోడలు ఉపాసన బిజినెస్ ఉమెన్‌గా, సామాజిక విషయాలపై ఎంతో అవగాహన ఉన్న మహిళగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల `యువర్ లైఫ్` వెబ్ పోర్టల్‌ను నిర్వహిస్తూ ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో విషయాలు వెల్లడిస్తున్నారు.తాజాగా ఈ వెబ్ పోర్టల్‌కు ప్రముఖ కథానాయిక రష్మికా మందన్న గెస్ట్‌గా హాజరైంది. చికెన్‌తో `కోలీ పుట్టు` కూర ఎలా వండాలో చూపించింది. రష్మిక వంటను రుచి చూసిన ఉపాసన వంద మార్కులేశారు. రష్మిక సూపర్ చెఫ్‌ అని ప్రశంసించారు ఉపాసన.