రాయచోటిలో ఘనంగా వికలాంగుల దినోత్సవం

అన్నమయ్య జిల్లా, రాయచోటి వికలాంగుల దినోత్సవ సందర్భంగా రాయచోటి అన్నమయ్య జిల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాల డైట్ లో వికలాంగుల దినోత్సవం ఘనంగా జరిగింది. వికలాంగులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని, వారికి వివిధ రకాల పెన్షన్లు మరియు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు స్వయం ఉపాధి, సదరం సర్టిఫికెట్స్, బస్సు పాసుల విషయం లో గాని వారికి అండగా ఉంటామని వికలాంగులకు భరోసా ఇచ్చారు. మంద కృష్ణ మాదిగ ఆకాంశమేరకు స్త్రీ శిశు సంక్షేమ శాఖలో విలీనం అయినటువంటి వికలాంగుల శాఖను ప్రత్యేకంగా వికలాంగులకు శాఖను ఏర్పాటు చేసిన కృషి అభినందనీయమని మందకృష్ణ మాదిగను వికలాంగులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాయచోటి గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ భాస్కర్ రెడ్డి, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు రామాంజనేయులు, జనసేన జిల్లా కోఆర్డినేటర్ రామ శ్రీనివాస్, విహెచ్పిఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి చిన్న సుబ్బయ్య, వి హెచ్ పి ఎస్ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు రెడ్డయ్య, బీఎస్పీ అధికార ప్రతినిధి వెంకటరమణ మరియు వికలాంగులు పెద్ద ఎత్తున పాల్గొని సభను విజయవంతం చేయడం జరిగింది.