రాయలసీమ ద్రోహి జగన్: అంకె ఈశ్వరయ్య

  • రాయలసీమ డోన్ సభ నుంచి మాట్లాడిన ప్రతి మాట అబద్ధం

అనంతపురం: రాయలసీమ నీటి కష్టాలు తెలుసు అని చెబుతున్నటువంటి జగన్ నాలుగున్నర సంవత్సరాలలో రాయలసీమ నీటి విషయంలో ఎక్కడ న్యాయం చేశావు, హంద్రీనీవా సుజల స్రవంతి పథకం కింద త్రాగునీరు సాగునీరు అందించి అన్ని చెరువులకు నీటిని నింపవలసిన జగన్ ఎందుకు నింపలేకపోతున్నారు. ఈరోజు రాయలసీమలోని అన్ని జిల్లాలలోను వర్షాలు పడితే గాని వ్యవసాయం జరగదు. పంటలు ఎండిపోతా ఉంటే కళ్ళుండి చూస్తా ఉన్నా కూడా ఎందుకు మౌనంగా ఉన్నావు జగన్.. రాయలసీమ జిల్లాలను ఎందుకు కరువు జిల్లాలుగా ప్రకటించలేకపోతున్నావు అని జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య మండిపడడం జరిగింది. రాయలసీమలో ఉన్నటువంటి నీటి ప్రాజెక్టుల విషయంలో జగన్ మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట అబద్ధం ఇతను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కటిఅంటే ఒక్క కొత్త ప్రాజెక్టుని ప్రారంభించాడా.. గత ప్రభుత్వాలు ప్రారంభించి పూర్తి చేస్తున్నటువంటి వాటిని చూపించి మాట్లాడుతున్నటువంటి జగన్ ఎందుకు రాయలసీమ ప్రాంతంలో కొత్త ప్రాజెక్టుల విషయంపై ఎందుకు మాట్లాడలేకపోతున్నావు. అనంతపురం జిల్లాలోని హెచ్ ఎల్ సి కెనాల్ ని ఎందుకు ఆధునీకరణ పనులు చేపట్ట లేకపోయారు. హెచ్ ఎల్ సీ కెనాల్ సమాంతర కాలవను ఎందుకు నిర్మించలేకపోతున్నారు. తుంగభద్ర డాం నుండి మనకు రావలసిన నీటి వాటా విషయంలో మరియు తుంగభద్ర డ్యామ్ కు ఎగువున కర్ణాటక ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి డ్యామ్ విషయంలో ఎందుకు స్పందించలేకపోతున్నారు. రాయలసీమ ప్రజల సమస్యల గురించి ఎప్పుడైనా మాట్లాడావా.. వాతావరణం మార్పుల వలన రాయలసీమ ప్రాంతం లోని రైతాంగం ఇబ్బందులకు గురవుతా ఉంటే కనీసం ఏనాడైనా కూడా పరామర్శించావా జగన్. రాష్ట్రంలో సామాజిక న్యాయం అనేది పేరుకు మాత్రమే తప్ప వైసీపీ ప్రభుత్వం ఇచ్చే పదవులలో లేదు ఉద్యోగస్తులకు, నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనలో లేదు, కేవలం బహిరంగ సభలో మాట్లాడడానికి మాత్రమే సామాజిక న్యాయం తప్ప వైసిపి ప్రభుత్వం చేతులలో కనిపించదు. జగన్మోహన్ రెడ్డి చెబుతున్నట్లుగా అడ్మినిస్ట్రేషన్, హాస్పిటల్స్, స్కూల్స్, మహిళలకు చేయూత, సామాజిక న్యాయం విషయంలో బహిరంగ చర్చకు రాగలరా జగన్ అని ఘాటుగా విమర్శించడం జరిగింది. గతానికి ఇప్పటికి రాష్ట్ర పరిస్థితి చూస్తుంటే పరిపాలన చేతకాక, మానసిక స్థితి బాగోలేక, ఒక ఆర్థిక నేరస్తుని.. సైకో జగన్ పరిపాలన స్పష్టంగా కళ్ళకు కనిపిస్తోంది. అప్పులు తెచ్చి పరిపాలన సాగించడం తప్ప ఉద్యోగ కల్పన లేక పారిశ్రమలను తీసుకురాక ఎలక్షన్లకు సమీపిస్తున్న తరుణంలో జీవోలు తెచ్చి టెంకాయలు కొట్టి డబ్బులు దోచే కార్యక్రమాలకు పాల్పడుతున్న జగన్ రెడ్డికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత లేదని ప్రజలు నిన్ను పిచ్చి ఆస్పత్రికి పంపించడానికి ఆరు నెలలు మాత్రమే సమయం ఉందని జనసేన పార్టీ అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య తీవ్రంగా హెచ్చరించడం జరిగింది.