రాయపరెడ్డి ఫౌండేషన్ ఉచిత అంబులెన్సులు

మాడుగుల నియోజకవర్గ జనసేన నాయకులు రాయపరెడ్డి కృష్ణ మాడుగుల నియోజకవర్గ ప్రజలకు ఉచిత అంబులెన్స్ సర్వీస్ కొరకు రెండు అంబులెన్సులను ఏర్పాటు చేశారు. ఈ అంబులెన్సులను తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జరుగుతున్న వారాహి యాత్ర వద్ద జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాయపరెడ్డి కృష్ణ మాట్లాడుతూ గతంలో నియోజకవర్గంలో సమయానికి అంబులెన్స్ అందుబాటులో లేక చాలామంది ఇబ్బంది పడడం జరిగిందని, సమయానికి అంబులెన్స్ రాక ఒకరిద్దరు ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగిందని, ఇలాంటి సంఘటనలు చూసిన తర్వాత ఎంతో మానసిక వేదనకు గురై అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజాసేవే ముఖ్యమన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా నియోజకవర్గ ప్రజలకి ఉచిత అంబులెన్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, . అంతేకాకుండా రాబోవు జనసేన ప్రభుత్వంలోనూ మాడుగుల నియోజకవర్గం అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తామని తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గ ఇన్చార్జ్ పంచకర్ల సందీప్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ మరియు వారాహి యాత్ర కో-ఆర్డినేషన్ కమిటీ సభ్యులు భోగిల శ్రీనివాస పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.