Razole: మానసిక వికలాంగులకు అన్నదానం చేసిన జనసైనికులు

రాజోలు మండలం, పొదలాడ గ్రామానికి చెందిన జనసేన నాయకులు పంచదార చినబాబు వారి కుమారుడు సాయి పవన్ పుట్టినరోజు సందర్భంగా రాజోలు మానసిక వికలాంగుల మనోజ్ కేంద్రంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు వీధి సత్తిబాబు, బొంతు గాంధీ మరియు మేడిచర్ల రామకృష్ణ పాల్గొన్నారు.