ఓటు హక్కును వినియోగించుకున్న రెడ్డి అప్పల నాయుడు

ప్రతి ఒక్కరూ తమ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఏలూరు నియోజకవర్గ జనసేన ఇంచార్జీ రెడ్డి అప్పలనాయుడు తెలిపారు.. 5వ డివిజన్లోని శ్రీరామ్ నగర్ కాలనీలో ఉన్న హైస్కూల్ లో కుటుంబ సమేతంగా ఓటు హక్కును రెడ్డి అప్పల నాయుడు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం ఏలూరు నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఏలూరు నియోజకవర్గంలోని 133వ బూథ్ లో ఏలూరు జనసేన పార్టీ ఇన్చార్జి అయిన నేను నా కుటుంబ సమేతంగా ఓటును ఉపయోగించుకోవడం జరిగిందని తెలిపారు. అలాగే ఏలూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈరోజు సాయంత్రం 6 గంటల లోపు తమ తమ ఓటును వినియోగించవలసిందిగా కోరుతున్నాం. భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకుని, భారతదేశ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పటు అందించాలని మనకు ఎవరైతే మంచి చేస్తారో, ఎవరైతే పని చేస్తారో, మన భవిష్యత్తును మన తలరాతను మార్చుకునే విధంగా కోరుతున్నామని ఈ సందర్భంగా తెలిపారు.