సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలి

గుంటూరు: జనసేన పార్టీ సిద్దాంతాలను ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేసి సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని ఆ పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు నేరెళ్ల సురేష్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక 32వ డివిజన్ బ్రాడీపేటలోని జనసేన డివిజన్ కార్యాలయంలో జనసేన నగర సంయుక్త కార్యదర్శి కొత్త కోటి ప్రసాద్ ఆధ్వర్యంలో జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదును విజయవంతం చేసేందుకు జనసైనికులతో సమావేశం జరిగింది. ఈ సంధర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తోన్న వైకాపా ప్రభుత్వం పై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిందన్నారు. వైసీపీ అరాచక పాలనలో నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగి సామాన్యులు బ్రతకలేని దుర్భర పరిస్తితులు నెలకొన్నాయని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో ప్రజా సమస్యలపై అనేక పోరాటాలు చేస్తోన్న జనసేనాని పవన కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరిచేలా ప్రజలు తమవంతు సహకారం అందించాలని పిలుపు నిచ్చారు. డివిజన్ లో చేపట్టబోయే సభ్యత్వ నమోదు లో స్థానికులు పాల్గొని తమ సహకారాన్నందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన ఐటీ సభ్యులు సునీల్ అఖిల్, 32వ డివిజన్ అధ్యక్షుడు చందు శీనువాసురావు, ప్రధాన కార్యదర్శి పాశం మధు, పాశం నాగార్జున, అరవింద్ జైన్, జుజ్జరపు రాజు, నల్లబోయిన అనిత, గబ్బిల సునీత, అనాల ఉదయ్, బోడ్డపాటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.