జనసేన ఆధ్వర్యంలో రోడ్లకి ఇరువైపున ఇబ్బందిగా ఉన్న కంచె చెట్ల తొలగింపు

అన్నమయ్య జిల్లా, రాజంపేట నియోజకవర్గ పరిధిలోని టి. సుండుపల్లి మండల పరిధిలో తిమ్మసముద్రం గ్రామపంచాయితీలో ఆదివారం చిట్టెడు వంక నుంచి మడితాడ్ గ్రామపంచాయితీ బైనేని మాలపల్లి వరకు సుమారు 3.1/2 కిలోమీటర్ల పొడవు మేర రోడ్డు కు ఇరు వైపులా ఉన్న కంప చెట్లను తొలగించి, వాహనాలు తిరగడానికి అనువుగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో తన సొంత ఖర్చులతో శ్రీనివాసరాజు కంప చెట్లను జేసీబీతో తొలగించారు. ఈ కార్యక్రమంలో రామ శ్రీనివాస్, యువకులు, అక్కడి స్థానికులు, మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.