ఎమ్మార్వో ఆఫీస్ కి వెళ్లే రహదారికి మరమ్మతులు చేయండి: రాహుల్ సాగర్

ఎమ్మిగనూరు, సోమప్ప సర్కిల్ నుంచి ఎమ్మార్వో ఆఫీస్ కి వెళ్లే రహదారికి అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలని జనసేన పార్టీ మండల అధికార ప్రతినిధి రాహుల్ సాగర్ డిమాండ్ చేశారు. మండల నుంచి వచ్చే ప్రజలు వివిధ పనుల కోసం ప్రతీ రోజూ వందల మంది ప్రయాణిస్తున్నారని, గుంతలమైన దారి కారణంగా ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారని, దీనికి తోడు దివ్యాంగులు కూడా తమ బండిని నడపలేక చాలా ఇబ్బంది పడుతున్నారని అధికారులు వెంటనే స్పందించి ఎమ్మార్వో ఆఫీస్ వెళ్లేదారిలో గుంతులు లేకుండా చేయాలని కోరారు.