రిపబ్లిక్ ప్రమోషన్స్… బాధ్యత తీసుకున్న మెగా హీరోస్

దేవకట్ట దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం రిపబ్లిక్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తోంది. అక్టోబర్ 1న ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. కాగా తాజాగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది.

ఇదిలా ఉండగా ఇటీవల సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ బాధ్యత మెగాహీరోలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే నిర్మాతలు ఏర్పాట్లు కూడా చేసుకున్నారట. మరి మెగా హీరోస్ సాయి ధరమ్ తేజ్ సినిమా ప్రమోషన్స్ విషయంలో ఏం చేస్తారో చూడాలి.