30రోజుల్లో వెయిట్ లాస్ ఛాలెంజ్‌ను ప్రారంభించిన రౌడీ బోయ్
ఫిట్‌నెస్‌పై ప్రతి ఒక్కరూ శ్రద్ధ చూపాలని టాలీవుడ్ హీరో, రౌడీ బోయ్ విజయ్‌దేవరకొండ అన్నారు. ప్రముఖ సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్ కుల్దీప్ సేథి, సునీతారెడ్డి ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్‌లోని 360డిగ్రీస్ ఫిట్‌నెస్‌లో ఏర్పాటు చేసిన 30రోజుల్లో బరువు తగ్గే ఛాలెంజ్‌ను సోమవారం హీరో విజయ్‌దేవరకొండ ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ మూడేండ్లుగా తాను ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నానన్నారు. ఆహార నియమాలను పాటిస్తూ సరైన రీతిలో వ్యాయామం చేస్తే బరువుతగ్గడం పెద్ద సమస్య కాదని తెలిపారు. ప్రముఖ హీరోలకు, హీరోయిన్లకు ఫిట్నెస్ ట్రైనర్‌గా ఉన్న కుల్దీప్ సేథి ప్రారంభించిన 30 డేస్ ఛాలెంజ్‌లో ప్రతి ఒక్కరూ పాల్గొని బరువు తగ్గాలని సూచించారు. ఈ సందర్భంగా చాలెంజ్‌కు సంబంధించిన వెబ్‌సైట్‌ను విజయ్ దేవరకొండ ప్రారంభించారు.