“ఆర్ఆర్ఆర్” షూటింగ్ పూర్తి చేసిన అలియా

బాలీవుడ్ నటి అలియా భట్ తాజాగా “ఆర్ఆర్ఆర్” షూటింగ్ ను పూర్తి చేసింది. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న మాగ్నమ్ ఓపస్ “ఆర్ఆర్ఆర్”పై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఈ చిత్రంతో అలియా దక్షిణ భారత సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో అలియా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇటీవలే “ఆర్ఆర్ఆర్” ప్రమోషనల్ సాంగ్ కోసం హైదరాబాద్ చేరుకున్న అలియా తాజాగా ఆ సాంగ్ షూటింగ్ ను పూర్తి చేసుకుని ముంబై బయల్దేరింది.

వరల్డ్ ఫ్రెండ్ షిప్ డే రోజున ఈ సాంగ్ ను రిలీజ్ చేస్తారని సమాచారం. ఇక ఇప్పటికే రాజమౌళి అండ్ టీం సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టేశారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోను రిలీజ్ చేయగా సినీ ప్రేమికుల నుంచి దానికి మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం రాజమౌళి ఈ సినిమాను వీలైనంత తొందరగా పూర్తి చేసే పనిలో పడ్డారు. ఈ ఏడాది అక్టోబర్ 13న సినిమాను విడుదల చేయనున్నారు.