అతిథి పాత్ర‌కు రూ.27 కోట్లు ‌…అక్ష‌య్

అక్ష‌య్ కుమార్ బాలీవుడ్ హీరోల్లో చాలా బిజీ హీరో. వ‌రుస సినిమాల‌కు ఓకే చెబుతున్నఅక్ష‌య్ …తాజాగా ఓ సినిమాలో అతిథి పాత్ర‌లో న‌టించ‌డానికి రెండు వారాలు డేట్స్ కేటాయించార‌ట‌. అందుకోసం ఆయ‌న రూ.27 కోట్ల రెమ్యున‌రేష‌న్‌ను తీసుకుంటున్నార‌ని టాక్‌. ధ‌నుశ్‌, సారా అలీఖాన్ జంట‌గా న‌టిస్తోన్న చిత్రం ‘అట్రంగీ రే’. ఆనంద్ ఎల్‌.రాయ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అతిథి పాత్ర‌లో అక్ష‌య్ న‌టిస్తున్నారు. ముందు ఈ పాత్ర‌లో హృతిక్‌ను న‌టింప చేయాల‌ని ద‌ర్శ‌కుడు భావించార‌ట‌. అయితే హృతిక్‌ బిజీగా ఉండ‌టంతో ఆ స్థానంలో అక్ష‌య్ కుమార్‌ను సంప్ర‌దించి భారీ రెమ్యున‌రేష‌న్ ఆఫ‌ర్ చేసి ఆయ‌న డేట్స్‌ను సంపాదించార‌ట‌.