అక్రమ ఇసుక రవాణా చేస్తున్న అధికార పార్టీ నాయకులు: దేశెట్టి అనంత నాయుడు

పెదకూరపాడు నియోజకవర్గంలో జనసేన పార్టీ పెదకూరపాడు నియోజకవర్గ అధికార ప్రతినిధి దేశెట్టి అనంత నాయుడు మాట్లాడుతూ కృష్ణానది పరివాహ ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా చేస్తూ నియోజకవర్గాన్ని నిలువు దోపిడీ చేస్తున్నారు నాలుగు ఐదు అడుగుల తోవాల్సిన కృష్ణా నదిలో 40 50 అడుగులు తోముతూ భూగర్భ జలాలు ఇంకిపోయే విధంగా ఇసుక మాఫియా చేస్తున్నారు 20-25 టన్నులు నింపాల్సిన లారీలకు 45-55 టన్నులు ఇసుకను నింపుతూ అధికలోడుతో రోడ్లు మీద దర్జాగా వెళ్తుంటే అధికారులు పట్టీ పట్టనట్టు చూస్తూ ఉంటున్నారు. ఒకపక్క న్యాయశాస్త్రం తీర్పు ఇచ్చినా కూడా నాయకులు అధికారులు పట్టించుకునే పాపాన కూడా పోవటం లేదు ఈ ప్రాంతంలో ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక దొరకని పరిస్థితుల్లో నియోజకవర్గ ప్రజలు ఉన్నారు. ఈ ప్రాంతం నుంచి ఇసుక తీసుకెళ్లి వేరే ప్రాంతంలో స్టాక్ యార్డ్లుగా తయారు చేసుకొని అధిక డబ్బులకి అమ్ముకుంటున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి శూన్యం చేస్తూ నియోజకవర్గాన్ని నిలువు దోపిడీ చేస్తున్న వాళ్లకు సరైన గుణపాఠం నియోజకవర్గం ప్రజలు చెప్పాలని రానున్న ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేస్తే ఇంతకంటే దారుణంగా నియోజకవర్గ పరిస్థితి ఉంటుందని నియోజకవర్గ ప్రజలు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.