సైనా బయోపిక్ రిలీజ్ డేట్

కరోనా వలన ఆగిన సినిమాలన్నీ ఇప్పుడు థియేటర్స్ లోకి వచ్చేస్తున్నాయి. బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ బయోపిక్ కూడా రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని ఓటీటీలోనా లేదంటే థియేటర్‌లో విడుదల చేయాలా అనే మీమాంసలో ఉన్నమేకర్స్ ఫైనల్ థియేటర్స్‌లోనే మార్చి 26 లేదంటే ఏప్రిల్ 9న రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తుంది.

బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ బయోపిక్‌లో పరిణీతి టైటిల్ పాత్ర పోషించగా ఇప్పటి వరకు చిత్రానికి సంబంధించి విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. సినిమా కూడా తప్పక అలరిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. కాగా, పరిణితి చోప్రా నటించిన సందీప్ పిర్ పింకీ ఫర్రార్ చిత్రం మార్చి 19 న విడుదల కానుండగా.. ది గర్ల్ ఆన్ ది ట్రైన్ ఫిబ్రవరి 26 న నెట్ఫ్లిక్స్ లో విడుదలైంది. ఇప్పుడు రేసులోకి మూడో చిత్రం వచ్చి చేరింది. మొత్తానికి ఈ ఏడాది మూడు సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తుంది పరిణితి చోప్రా.