సంకు శివ ప్రదీపకు చేయూతనిచ్చిన కొవ్వలి ఫౌండేషన్

నరసాపురం కొవ్వలి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని 8వ వార్డుకు చెందిన సంకు శివ ప్రదీప అనే విద్యార్థి యంసిఏ విద్యను అభ్యసించేందుకు రూపాయలు 30 వేల ఆర్థిక సాయాన్ని కొవ్వలి ఫౌండేషన్ చైర్మన్ కొవ్వలి యతిరాజ రామ్మోహన్ నాయుడు, అధ్యక్ష, ఉపాధ్యక్షులు నిమ్మకాయల గోపాలరావు నీలిమలు శుక్రవారం అందజేయడం జరిగింది. కొవ్వలి ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవలను స్ఫూర్తిగా తీసుకుని రామ్మోహన్ నాయుడు స్నేహితుడు బండారు విశ్వ మోహన్ కుమార్ రూపాయలు 10 వేలు ఆర్థిక సాయాన్ని శివ ప్రదీపకు అందజేశారు. ఈ సందర్భంగా కొవ్వలి ఫౌండేషన్ ఉపాధ్యక్షులు నిమ్మకాయల గోపాలరావు మాట్లాడుతూ ఫౌండేషన్ సమాజానికి అందిస్తున్న సేవలను వివరించారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే కొవ్వలి ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. రామ్మోహన్ నాయుడు సూచనలు మేరకు కులమతాలకు, రాజకీయాలకు అతీతంగా కొవ్వలి ఫౌండేషన్ ద్వారా నిస్వార్థ సేవలను అందిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో సంకు భాస్కర నాయుడు, నంద్యాల బాబు, నండా రామకృష్ణ, భోగిరెడ్డి ముత్యం, నంద్యాల హనుమంతు, సందక సురేష్, మల్లాడి మూర్తి, పొన్నమండ మురళీ, గుగ్గీలపు బుజ్జి, బండారు విశ్వ మోహన్, గునిశెట్టి రామకృష్ణ, ముస్కుడి రవి, చెళ్ళబోయిన వాసు, నిమ్మకాయల బాబ్జీ, రేవు పద్మారావు, పంజా దినేష్ తదితరులు పాల్గొన్నారు.