జనసేన ఆధ్వర్యంలో సర్పంచ్ నిరసన

అమలా పురం: అల్లవరం మండలం, గోడితిప్ప గ్రామ సర్పంచ్ చిట్నీడి శ్రీదేవి విధులకు ఆటంకం కలిగిస్తూ.. కనీస ప్రోటోకాల్ పాటించక మహిళా సర్పంచ్ ను అవమానించడం వంటి చేస్తున్నారు. వై సి పి నాయకుల అప్రజాస్వామిక చర్యలను నిరసిస్తూ జనసేన పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ శెట్టిబత్తుల రాజబాబు ఆధ్వర్యంలో అల్లవరం ఎమ్ డి ఓ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, వీరమహిళలు జనసైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.